- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగాస్టార్ చిరంజీవితో మంత్రి కొండా సురేఖ భేటీ
మంత్రి కొండా సురేఖ నేడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన కూతురు సుస్మితతో కలిసి కొండా సురేఖ జూబ్లిహిల్స్ లోని చిరు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన ఇష్టదైవమైన ఆంజనేయస్వామి చిత్రపటాన్ని కొండా సురేఖ అందజేశారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ నేడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన కూతురు సుస్మితతో కలిసి కొండా సురేఖ జూబ్లిహిల్స్ లోని చిరు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన ఇష్టదైవమైన ఆంజనేయస్వామి చిత్రపటాన్ని కొండా సురేఖ అందజేశారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంత్రి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాకుండా తన పోస్ట్ లో చిరంజీవిని మాజీ కేంద్రమంత్రి అంటూ కొండా సురేఖ సంభోదించడం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి మాజీ కేంద్రమంత్రి అయినప్పటికీ చాలా ఏళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తేలేదని సైతం ఆయన గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు.
అయితే మంత్రి చిరంజీవిని ఎందుకు కలిశారు అన్నదానిపై మాత్రం స్పష్టత రాలేదు. రీసెంట్ గా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ దంపతులు కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరోవైపు సుస్మిత చిరంజీవి అభిమాని అని అందుకే ఆయనను కలిసేందుకు వెళ్లారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే అప్పట్లో కొండా సురేఖ సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె చిరంజీవిని కలవడంతో అప్పుడు సినిమావాళ్లను తిట్టి ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్నారు.






