- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister: చిన్నారులకు ఎటువంటి లోటు రాకుండా చూస్కోండి
by Gantepaka Srikanth |
సిద్దిపేట(Siddipet) జిల్లా దౌల్తాబాద్ మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట(Siddipet) జిల్లా దౌల్తాబాద్ మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న పోషక ఆహారంపై ఐసీడీఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి సమగ్ర వివరాలు అంగన్వాడీ సిబ్బంది అందజేశారు. ప్రస్తుతం కొండా సురేఖ ఉమ్మడి మెదక్(Medak) జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆయా కేంద్రంలో కార్యకర్తలు, చిన్నారులకు సమస్యలు తీరనున్నాయి.
Next Story






