- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవుడి మాన్యాలను కబ్జా చేసిన ఎవరినీ వదిలిపెట్టం: కొండా సురేఖ
by GSrikanth |
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని సంబంధిత శాఖ మంతి కొండా సురేఖ ఆరోపించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని సంబంధిత శాఖ మంతి కొండా సురేఖ ఆరోపించారు. సోమవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదాయ శాఖతో పాటు దేవుడి మాన్యాలను కూడా కబ్జా చేశారని కీలక ఆరోపణలు చేశారు. సర్వే నెంబర్ల ద్వారా దేవాలయాల భూములకు హద్దులు గుర్తిస్తామని అన్నారు. అంతేకాదు.. దేవుడి పేరుతో పాసు పుస్తకాలు కూడా జారీ చేస్తామని తెలిపారు. అక్రమాలు, కబ్జాలకు పాల్పిన ఎవరినీ వదిలి పెట్టం. విచారణకు ఆదేశించామని అన్నారు. భక్తుల నుంచి వచ్చే విరాళాల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్‌సైట్లు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
Next Story






