- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఆఫీస్‌లోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన మంత్రి.. ముందు షాకైనా తర్వాత హర్షం వ్యక్తం చేసిన అధికారులు
గచ్చిబౌలి(Gachibowli)లోని తెలంగాణ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ మరియు శిక్షణ సంస్థ(EPTRI)ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలి(Gachibowli)లోని తెలంగాణ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ మరియు శిక్షణ సంస్థ(EPTRI)ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం కారణంగా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునే సంస్థ సమస్యల నిలయంగా మారడంపై సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సంస్థని గాడిలో పెట్టాలని.. తగిన అవసరాలు ఏంటో సమగ్రంగా తమకు నివేదిక అందజేయాలని ఈపీటీఆర్ఐ(EPTRI) సంస్థ డైరెక్టర్ జనరల్ అహమద్ నదీంకి ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగస్తుల సమస్యలను అడిగి తెలుసుకొని తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థకి గవర్నమెంట్ సంస్థల ద్వారా ప్రైవేట్‌కి ఇచ్చే పనులని ఈపీటీఆర్ఐ(EPTRI) కి నామినేషన్ పద్దతిలో ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంస్థని ఆధునీకరించేందుకు ప్రభుత్వం నుండి కావాల్సిన నిధుల కోసం తగిన ప్రతిపాదనలను పంపించాల్సిందిగా మంత్రి సురేఖ స్పష్టం చేశారు. గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగ యువతకి అందిస్తున్న శిక్షణ పొందుతున్న వాళ్లకి సర్టిఫికెట్స్ అందజేశారు.
ఈపీటీఆర్ఐ (EPTRI) ఏర్పడినప్పటి నుండి గత 30 సంవత్సరాల నుండి సంస్థని పట్టించుకునే వారు లేకుండే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఒక మంత్రి తమ సంస్థని తనిఖీ చేసి సమస్యలని అడిగి తేల్చుకొని తగిన పరిస్కారాలు చూపడాన్ని ఉద్యోగులు హర్షిస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.






