రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన యువకుడికి మంత్రి కొండా సురేఖ బాసట

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-23 17:38:13  IST  )

వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన గుండేటి రాహుల్ అనే విద్యార్థికి మంత్రి కొండా సురేఖ బాసటగా నిలిచారు.

రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన యువకుడికి మంత్రి కొండా సురేఖ బాసట
X
  • మంత్రి కొండా సురేఖకు , సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్ధి రాహుల్

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన గుండేటి రాహుల్ అనే విద్యార్థికి మంత్రి కొండా సురేఖ బాసటగా నిలిచారు. రాజస్థాన్ కోటాలో రైలు ప్రమాదంలో రాహుల్ తన రెండు కాళ్లను కోల్పోయాడు. హాస్పిటల్లో చేర్పించగా రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆసుపత్రి యాజమాన్యం తెలుపగా తన దగ్గర అంత డబ్బు చెల్లించే స్తోమత లేకపోవడంతో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దగ్గరికి వెళ్లి సమస్యను వివరించారు. స్పందించిన మంత్రి కొండా సురేఖ సీఎంఆర్ఎఫ్ స్కీమ్ ద్వారా పది లక్షల రూపాయలు మంజూరు చేశారు. నిమ్స్ లో ఆధునిక పద్ధతులతో కృత్రిమ కాళ్లు అమర్చారు. ప్రమాదం నుంచి కోలుకున్న రాహుల్, అతని తల్లి దండ్రులు శనివారం సచివాలయంలో కొండా సురేఖను కలుసుకున్నారు. మంత్రి సహకారంతో సీఎంఆర్ఎఫ్ స్కీమ్ ద్వారా డబ్బులు అందాయని, వాటితోనే తమ అబ్బాయి తిరిగి కాళ్లను పొందాడని ఎల్లవేళలా మంత్రి కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాహుల్ ఎలాంటి డిప్రెషన్ లోకి వెళ్లకుండా చక్కగా చదువుకోవాలని మీ అమ్మానాన్నలతో పాటు నీకు ఎల్లవేళలా అండగా ఉంటామని మంత్రి సురేఖ భరోసానిచ్చారు.

Next Story