- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్కడా రాజీ పడొద్దు: మంత్రి కొండా సురేఖ
జగిత్యాల జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు కూడా సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధర్మపురి ఆలయ మాస్టర్ ప్లాన్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రివ్యూ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎండోమెంటు డైరెక్టర్ హరీష్, డిపార్టుమెంటు ఉన్నతాధికారులు, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. వందలాది సంవత్సరాలు చరిత్ర ఉన్న ధర్మపురి ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్రం, వేద పండితులు, స్థానికుల, భక్తులు మనోభావాలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధర్మపురిలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి స్వయంభు మూర్తి, ఋషులు, దేవతలు సంచరించిన పవిత్ర ప్రాంతం, ఈ అంశం దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. దాంతోపాటు, 2027 జూలైలో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని మంత్రి ఆదేశించారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్‌కు అవసరమైన స్థల సేకరణ వివరాలు మంత్రి, అధికారులను అడిగి సంపూర్ణంగా తెలుసుకున్నారు. స్థల పురాణం ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం రూ.50 కోట్లతో చేపట్టే నిర్మాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా చూడాలని చెప్పారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. తన సొంత నియోజకవర్గంలో కొలువై ఉన్న స్వామివారి ఆలయాన్ని విస్తృతంగా అభివృద్ది పరుస్తున్న మంత్రి కొండా సురేఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంత పని ఒత్తిడిలోనూ తమ టెంపుల్ కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి.. అభివృద్ధి చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ టెంపుల్ కోసం అయ్యే స్థల సేకరణకి సంబంధించిన అంశాల్లో తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని హామీనిచ్చారు. అందరి సహకారంతో గోదావరి పుష్కరాలు కూడా విజయవంతంగా చేస్తామని హామీనిస్తున్నట్టు వెల్లడించారు.






