‘నా ఎదుగుద‌లే నిలువెత్తు నిద‌ర్శనం’.. మహిళా దినోత్సవం వేళ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ(Telangana Womens)లోని ఆడబిడ్డలందరికీ అంత‌ర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) శుభాకాంక్షలు చెప్పారు.

‘నా ఎదుగుద‌లే నిలువెత్తు నిద‌ర్శనం’.. మహిళా దినోత్సవం వేళ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana Womens)లోని ఆడబిడ్డలందరికీ అంత‌ర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ‘ఒకనాడు మహిళలు అంటే వంటింటి కుందేళ్ళు అని అనే వాళ్ళు.. కానీ, నేడు ఈ ప్రపంచపు ప్రగతికి రథ చక్రాలుగా మారారు. మ‌హిళా సాధికార‌త కోసం తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. అందుకు నిలువెత్తు నిద‌ర్శనం నా ఎదుగుద‌ల‌నే. ఒక మ‌హిళ అయిన నాకు ప్రజాప్రతినిధిగా.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా అవ‌కాశం ల‌భించింది. మన తెలంగాణ‌ గడ్డ మీద మహిళామణులు చాకలి ఐలమ్మ, ఈశ్వరీభాయి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి హేమాహేమీలు నడిచిన నేల ఇది’ అని సురేఖ అన్నారు.

‘తెలంగాణలో ప్రతి మహిళా ఒక వీరనారే. మహిళలు గడ్డపరకలు కాదు... గడ్డపారలు నిరూపించిన ఉదంతాలెన్నో ఉన్నయ్. మహిళ కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చేస్తున్నది. కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వరుల‌ను చేయాల‌న్న త‌లంపుతో వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాల‌ను అమ‌లు ప‌రుస్తోంది. గ‌తంలో మ‌హిళా సంఘాలు అంటే స్వయం ఉపాధి. కాని ప్రజా ప్రభుత్వంలో మ‌హిళా సంఘాలు అంటే ప‌ది మందికి ఉపాధి. మ‌హిళ‌ను మ‌హాల‌క్ష్మీగా గౌర‌వించ‌డం మ‌న సంస్కృతి. అందుకే మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తోంది. దాంతో ఆదా అయ్యే మొత్తాన్ని ఇత‌ర అవ‌స‌రాల‌కు ఖ‌ర్చు చేసుకునే వెసులుబాటు మ‌హిళ‌ల‌కు క‌లిగింది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు కోట్లాది మంది మ‌హిళ‌లు ఈ ప‌థ‌కం ఉప‌యోగించుకున్నారు. నిరుపేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి గృహిణుల వంటింటి భారాన్ని త‌గ్గించేందుకు రూ. 500 కే వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌ను అందిస్తోంది ప్ర‌జా ప్ర‌భుత్వం. ఇప్ప‌టి వ‌ర‌కు 50 ల‌క్ష‌ల కుటుంబాలకు రాయితీ సిలిండ‌ర్లు అందుతున్నాయి’ అని కొండా సురేఖ అన్నారు.

‘ఇందిరా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కం ద్వారా మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. మ‌హిళ‌లు అంటే కుట్లు, అల్లిక‌లే కాదు.. మ‌హిళ‌లు అంటే సంప‌ద సృష్టిక‌ర్తలు. అందుకే మ‌హిళా శ‌క్తి కార్యక్రమం కింద 17 ర‌కాల వ్యాపారాలను గుర్తించి మ‌హిళా సంఘాల‌ను శిక్షణ ఇస్తున్నారు. ఆదానీ, అంబానీల‌కే ప‌రిమితం అయిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను మ‌హిళా సంఘాల‌కు అప్ప‌గిస్తున్నాం.. మహిళలు ఏ బిజినెస్ పెట్టుకోవాలన్నా సీఎం రేవంత్ రెడ్డి ఒక పెద్దన్నగా అండదండగా నిలబడి పనిచేస్తున్నారు. లింగ వివక్షత ఉండకూడద‌నే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక ఎదుగుదల వంటి కార్య క్ర‌మాలు చేప‌ట్టి స‌పోర్ట్ చేస్తోంది. రానున్న రోజుల్లో మహిళలకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతాం’ అని అన్నారు.

Next Story