konda susmita: తొందరపడి అన్నదో తెలియదు! సుస్మితా పటేల్ రాజకీయ ఎంట్రీపై కొండా దంపతుల కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

కొండా సుస్మితా పటేల్ రాజకీయ ఎంట్రీ, ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించడం‌పై మంత్రి కొండా సురేఖ దంపతులు స్పందించారు.

konda susmita: తొందరపడి అన్నదో తెలియదు! సుస్మితా పటేల్ రాజకీయ ఎంట్రీపై కొండా దంపతుల కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొండా సుస్మితా పటేల్ (konda susmita patel) రాజకీయ ఎంట్రీ, ఎమ్మెల్యే టికెట్ ఆశించడం‌పై మంత్రి కొండా సురేఖ దంపతులు స్పందించారు. వరంగల్ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాల నేపథ్యంలో గురువారం కొండా సురేఖ దంపతులు ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో కూతురు రాజకీయ ఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నా కూతురు ఆలోచనను మేము కాదనలేం.. అని స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు తనకు ఉందని తెలిపారు. దీనిపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటామని (Konda Surekha) మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కొండా మురళి (Konda Murali) మాట్లాడుతూ.. నా కూతురు ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదని కొండా మురళి అన్నారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుందని తెలిపారు. నా కూతురు తొందరపడి అన్నదో.. ఆలోచించి అన్నదో నాకైతే తెలియదు.. అని స్పష్టం చేశారు.

కాగా, వరంగల్ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు చెలరేగుతున్న సమయంలో మంత్రి కొండా దంపతుల కూతురు కొండా సుస్మితా పటేల్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టేటస్, బయో చర్చానీయంశంగా మారింది. ‘పరకాల ఎమ్మెల్యే అబ్యర్ధి’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నట్లు పరోక్షంగా ఆమె సోషల్ మీడియా వేదికగా తెలపడం వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ పార్టీకి మంత్రి కొండా సురేఖ దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఐదుమంది ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఇటీవల ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయినిరాజేంద‌ర్ రెడ్డి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి, భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌, వ‌రంగ‌ల్ డీసీసీ అధ్యకురాలు ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌ తదితర కీలక నేతలకు కొండా ఫ్యామిలీ కి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Next Story