- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎమ్మెల్సీ కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్
కవిత బీసీ ధర్నా పెద్ద జోక్ అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ సంవత్సరానికే ఇది పెద్ద జోక్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కవిత బీసీ ధర్నా పెద్ద జోక్ అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ సంవత్సరానికే ఇది పెద్ద జోక్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వస్తున్నా.. పార్టీతో నాకు సంబంధం లేదనే కవిత ధర్నా చేస్తుందని వ్యాఖ్యానించారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు తాను అదే పార్టీలో ఉన్నానని అన్నారు. ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచానని అన్నారు.
కానీ ఆనాడు తనకు మంత్రి పదవి ఇవ్వలేదని మరి ఆరోజు కవిత ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఒక మహిళలకు, బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని కవిత అడగలేదన్నారు. ఈ రోజు కవిత తన ఉనికి చాటుకునేందుకే బీసీ నినాదంతో మాట్లాడుతుందన్నారు. కవిత మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని, దయచేసి కవిత బీసీల గురించి మాట్లాడవద్దని అన్నారు. ఆమె బీసీల గురించి మాట్లాడితే వారిని అవమానించినట్టు ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.






