వ‌ర‌ల్డ్ క్లాస్‌ విధానాల‌తో తెలంగాణ జూ పార్కులు న‌డపాలి: మంత్రి కొండా సురేఖ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-22 15:25:52  IST  )

ప్రపంచ స్థాయి విధానాల‌ను అవ‌లంభించి రాష్ట్రంలోని జూ పార్కుల‌ను న‌డపాల‌ని తెలంగాణ రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాష్ట్రంలోని జూ పార్కుల్లో జంతువుల ప‌రిర‌క్షణకు ప్రత్యేక చర్యలు అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

వ‌ర‌ల్డ్ క్లాస్‌ విధానాల‌తో తెలంగాణ జూ పార్కులు న‌డపాలి: మంత్రి కొండా సురేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ స్థాయి విధానాల‌ను అవ‌లంభించి రాష్ట్రంలోని జూ పార్కుల‌ను న‌డపాల‌ని తెలంగాణ రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాష్ట్రంలోని జూ పార్కుల్లో జంతువుల ప‌రిర‌క్షణకు ప్రత్యేక చర్యలు అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణ‌లోని అన్ని జూ పార్కులతో పాటు, అర్బన్ ఫారెస్ట్ పార్కులను మెరుగైర సౌకర్యాలతో తీర్చిదిద్దాల‌ని మంత్రి సురేఖ సూచించారు. జూ లలో మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తే సందర్శకులు పెద్ద సంఖ్యలో వ‌స్తార‌ని అన్నారు. గురువారం తెలంగాణ‌ రాష్ట్ర సచివాలయం కాన్ఫరెన్స్ హాలులో మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జ‌పాట్‌) 14వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పిసిసిఎఫ్ డాక్టర్​ సువ‌ర్ణ (హెచ్ఓఎఫ్ఎఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలుసింగ్ మేరు, సిసిఎఫ్ లు ప్రియాంక వర్గీస్, రామలింగం, డైరక్టర్ జూ పార్క్స్ సునీల్ ఎస్. హేరామత్, పలువురు డిఎఫ్ఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సందర్శకుల అభిరుచుల మేరకు, పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, అటవీశాఖకు ఆదాయం సమకూరే విధంగా పకడ్బందీ ప్రణాళికలతో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పని చేయాలని ఆదేశించారు.

ప్రపంచవ్యాప్తంగా జూ పార్కుల్లో అవలంబిస్తున్న విధానాలను అమలు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్రంలోని నెహ్రూ జూ పార్క్, కాకతీయ జూ పార్క్‌, పిల్లలమర్రి మినీ జూపార్క్‌, లోయర్‌ మానేరు డీర్‌ పార్క్‌, కిన్నెరసాని డీర్‌ పార్క్‌ జంతు సంరక్షణ చర్యలు, కేబీఆర్‌, మృగవని, మహవీర్‌ హరిణ వసన్థలి ఇతర అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల్లో సందర్శకుల సంఖ్య పెరిగిన‌ట్టు అధికారులు మంత్రి కొండా సురేఖ కు వివ‌రించారు. కాగా, సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని ఆమె సూచించారు. అదనపు సౌకర్యాలపై దృష్టి సారించాల‌ని, అందుకు సంబంధించి శాఖ ఉన్నతాధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. కాగా, గ‌త ఏడాది జూ పార్కుల తాలుకూ నిర్వహణ బ‌డ్జెట్ అనుమ‌తులను మంత్రి నుంచి అధికారులు తీసుకున్నారు.

Next Story