- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Nagarjuna Vs Konda Surekha : నాగార్జున పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరైన మంత్రి కొండా సురేఖ

దిశ, వెబ్ డెస్క్ : హీరో అక్కినేని నాగార్జున(Hero Akkineni Nagarjuna) వేసిన పరువు నష్టం కేసు(Defamation Case)లో మంత్రి కొండా సురేఖ( Minisrter Konda Surekha) కోర్టుకు హాజరయ్యా(Attended Court)రు. కొండా సురేఖ ఈ రోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో స్పెషల్ జడ్జి ముందు విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ కేటీఆర్ తో పాటు నాగార్జున కుటుంబంపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సమంత, నాగచైతన్య విడిపోయేందుకు కారణం కేటీఆరేనని కొండా సురేఖ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
సురేఖ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హీరో నాగార్జున, కేటీఆర్ లు వేర్వేరుగా మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దాఖలు వేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన కుటుంబాన్ని ఎంతగానో బాధించాయని.. సినిమా ఇండస్ట్రీలో ఏళ్లుగా ఎంతో గౌరవంగా ఉంటున్న తమలాంటివారిపై ఇలాంటి ఆరోపణలు చేయటం వల్ల తమ పరువుకు తీవ్ర భంగం వాటిల్లిందని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో ఇప్పటికే కోర్టులో తమ వాదనలు వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసిన న్యాయవాది.. ఆ వ్యాఖ్యలను అన్ని మీడియా సంస్థలు ప్రచురితం చేసిన తర్వాత ట్విట్టర్‌లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారని తెలిపారు. మంత్రి పెట్టిన పోస్టును ధర్మాసనానికి చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం ఎంతో కుంగిపోయిందని.. ఖచ్చితంగా ఆమె క్రిమినల్ చర్యలకు అర్హురాలని అశోక్ రెడ్డి వాదించారు.
ఈ కేసులలో నాగార్జున సహా కేటీఆర్, సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్న కోర్టు మంత్రి కొండా సురేఖను కూడా కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరై.. ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపధ్యంలో కొండా సురేఖ, తన లాయర్ గురుప్రీత్ సింగ్ తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే కొండా సురేఖ క్షమాపణలు చెప్పారని ఆమె తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన విమర్శలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేదని నాగార్జున తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.