ఇస్కాన్ సంస్థకు ప్రభుత్వ సహకారం ఉంటుంది: మంత్రి భరోసా

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-27 16:05:39  IST  )

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఇస్కాన్(ISKCON) సంస్థ నిర్వహించిన జగన్నాథస్వామి రథయాత్రలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పాల్గొన్నారు.

ఇస్కాన్ సంస్థకు ప్రభుత్వ సహకారం ఉంటుంది: మంత్రి భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఇస్కాన్(ISKCON) సంస్థ నిర్వహించిన జగన్నాథస్వామి రథయాత్రలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మహోత్సవాన్ని ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లిన గొప్ప దృష్టిశాలి భక్తివేదాంత స్వామి ప్రభుపాద సేవలు శ్లాఘనీయం. వీరి ఆధ్వర్యంలో 1100 కంటే ఎక్కువ ఇస్కాన్ కేంద్రాలలో రథయాత్రలు ఘనంగా నిర్వహించబడుతుండటం హర్షణీయం. ఇస్కాన్ వారు ఇప్పటివరకు వరకు రెండు బిలియన్ల కంటే ఎక్కువ ప్రసాదం పంపిణీ చేయడం ప్రశంసానీయం. రోజూ పూరిలో, వివిధ ప్రదేశాల్లో కూడా ప్రసాదం అందిస్తూ, భౌతికంగా, ఆధ్యాత్మికంగా సమాజాన్ని ఆధ్యాత్మిక చింతన వైపు తీసుకెళ్ళుతున్న ఇస్కాన్ వారికి మా ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుంది. అలాగే ఇటీవల జరిగిన ప్రయాగరాజ్ మహాకుంభ మేళలో ఇస్కాన్ సంస్థ చేసిన పెద్దస్థాయి సేవలు ప్రత్యేకంగా అభినందనీయం. దేశంలో సనాతన ధర్మాన్ని, మన భారతీయ సంస్కృతిని సంరక్షిస్తూ సమాజానికి ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేస్తూ అద్భుతమైన సేవ చేస్తున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇస్కాన్ సేవా కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందించడానికి కట్టుబడి ఉందని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

Next Story