- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తక్షణమే అధ్యక్షుడిని మార్చండి’.. CM రేవంత్‌కు మంత్రి కోమటిరెడ్డి లేఖ
కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. డీసీసీ అధ్యక్షుల ప్రకటన వివాదానికి దారి తీసింది. నల్లగొండ జిల్లా కొత్త డీసీసీ ప్రకటన విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. డీసీసీ అధ్యక్షుల ప్రకటన వివాదానికి దారి తీసింది. నల్లగొండ జిల్లా కొత్త డీసీసీ ప్రకటన విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ కొత్త డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత(Punna Kailash Netha)పై మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. తక్షణమే కైలాష్ నేతను డీసీసీ అధ్యక్షుడిగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రెండేళ్ల క్రితం.. నా కుటుంబంపై కైలాష్ నేత అసభ్యంగా మాట్లాడటంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టాడని ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. కైలాష్ నేతపై పోలీస్ స్టేషన్‌లోనూ కంప్లైంట్ చేస్తానని అన్నారు. మరోవైపు కొత్త డీసీసీ కైలాష్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.






