- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తెలంగాణలో హరీష్ రావు కొత్త పార్టీ’.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
కేసీఆర్ కుటుంబ గొడవలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ కుటుంబ గొడవలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. కాంగ్రెస్ మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుంది. పార్టీ నుంచి కవిత(MLC Kavitha)ను సస్పెండ్ చేయకపోతే హరీష్ రావు ఊరుకోరు. అంతేకాదు.. కవితను సస్పెండ్ చేయకుంటే నూటికి నూరు శాతం హరీష్ రావు కొత్త పార్టీ పెడతారు. ఈ విషయం ఆల్రెడీ కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారని మాకు సమాచారం వచ్చింది. ఈ అంశంపై రేపు మాట్లాడుదామని కేసీఆర్ అన్నారట. కేసీఆర్ కుటుంబ గొడవలతో మాకు సంబంధం లేదు. మేము తలదూర్చం కూడా. అనవసరంగా కాంగ్రెస్‌పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో అవినీతి జరిగిందని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. దీనిపై విచారణ జరపాలని తాము సీబీఐకి అప్పగించాం. ఇక అవినీతి చేసిన వారు ఎవరో సీబీఐ తేలుస్తుంది. అప్పటివరకు వేచి ఉందాం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.






