స్థానిక ఎన్నికల తేదీలపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

by Malleboina Mahesh |

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రడ్డి కీలక ప్రకటన చేశారు.

స్థానిక ఎన్నికల తేదీలపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections)పై వాడి వేడిగ చర్చ జరుగుతోంది. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం (State Govt) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు జరుగుతాయని ప్రకటించగా.. ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను 3 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మొదట ఎంపీటీసీ, తర్వాత జడ్పీటీసీ ఎన్నికలు (MPTC and ZPTC elections) జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ 10 లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని, 30 లోపు ఎన్నికలు అయిపోతాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం వేగంగా ఎన్నికల నిర్వహించే విధంగా ముందుకు సాగుతుండగా ఇటీవల ఎన్నికల సంఘం (Election Commission) స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Next Story