- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హృదయాన్ని తాకే కథలు చెప్పండి’.. ఫిల్మ్ మేకర్స్‌కి మంత్రి కోమటిరెడ్డి సలహా
‘హృదయాన్ని తాకే కథలు చెప్పండి’.. ఫిల్మ్ మేకర్స్‌కి మంత్రి కోమటిరెడ్డి సలహా

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ – HISFF 2025లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంతటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో నాకు పాల్గొనే అవకాశం దొరకడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. హైదరాబాద్ అంటేనే ఇప్పుడు సినిమా అని అన్నారు. దేశం నలుమూలల నుంచి ఫిల్మ్ మేకర్స్ ఇక్కడికి వచ్చి కొత్త క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. షార్ట్ ఫిల్మ్స్ యువతకు స్వేచ్ఛను, సృజనాత్మకతను ఇస్తాయి. కొత్తగా ఆలోచించే, కొత్తగా ప్రయత్నించే వేదికగా ఇవి నిలుస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి పూర్తి మద్దతు అందిస్తోందని వెల్లడించారు. యువ టాలెంట్‌కి అవకాశాలు, సరైన ప్లాట్‌ఫార్మ్ అందించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. మన తెలంగాణను దేశంలోనే ఫిల్మ్ మేకర్స్‌కి బెస్ట్ స్టేట్‌గా మార్చడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ఫెస్టివల్‌లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల ఫిల్మ్ మేకర్స్ పాల్గొనడం ఎంతో ప్రశంసనీయం. ఇది నిజంగా "మినీ ఇండియా"గా హైదరాబాద్‌ను ప్రతిబింబిస్తోందని అన్నారు. అవార్డు వచ్చినా రాకపోయినా ప్రతి ఫిల్మ్ మేకర్ కథకు విలువ ఉంది. ధైర్యంగా, హృదయాన్ని తాకే కథలు చెప్పండి. ముందుకు సాగండని సూచించారు. ఆర్గనైజింగ్ టీమ్‌కి అభినందనలు, పాల్గొన్న అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.






