బస్సు నడిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

by Ajay Maddhiboyina |

మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి బ‌స్సు డ్రైవ్ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. నేడు న‌ల్గొండ జిల్లాలోని దండంప‌ల్లిలో 8 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించ‌నున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేష‌న్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

బస్సు నడిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి బ‌స్సు డ్రైవ్ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. నేడు న‌ల్గొండ జిల్లాలోని దండంప‌ల్లిలో 8 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించ‌నున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేష‌న్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్రమంలో మంత్రులు పొన్నం ప్రభాక‌ర్, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం ఉన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కోమ‌టిరెడ్డి డ్రైవ‌ర్ సీటులో కూర్చుకుని కొంత‌దూరం వ‌రకు బ‌స్సును న‌డిపారు. అదే బ‌స్సులో పొన్నం ప్ర‌భాక‌ర్, వేముల వీరేశంతో పాటు కొంద‌రు నాయ‌కులు సైతం ఉన్నారు. మంత్రి బ‌స్సు న‌డ‌ప‌టంతో దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. కోమ‌టిరెడ్డి అభిమానులు వీడియోను సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

Next Story