- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ కార్మికుల వేతనాలు పెంచాల్సిందే.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సినీ కార్మికుల ఆందోళనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: సినీ కార్మికుల ఆందోళనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులకు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం సినీ కార్మికులతో ప్రత్యేకంగా భేటీ అయి మాట్లాడుతా అని వెల్లడించారు. ప్రస్తుతం సినీ కార్మికుల ఆందోళనపై దిల్ రాజు(Dil Raju) చర్చిస్తున్నారని అన్నారు. ప్రతీ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్నాం.. నిర్మాతలు మొండిగా ఉండకూడదు. కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు మెగస్టార్ చిరంజీవిని కలిశారు. దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, సుప్రియ, మైత్రీ రవి భేటీ అయ్యారు. సినీ కార్మికుల బంద్ విషయంపై నిర్మాతలు చర్చించారు. కార్మికుల వేతనాల పెంపు వివాదం, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలను నిర్మాతలు చిరంజీవికి వివరించారు.






