- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వండి’.. నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ రహదారిపై టోల్ ఫీజు లేకుండా రవాణాకు అనుమతివ్వాలని లేఖలో పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) లేఖ రాశారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ రహదారిపై టోల్ ఫీజు లేకుండా రవాణాకు అనుమతివ్వాలని లేఖలో పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ టోల్ ఫీజు లేకుండా ప్రయాణానికి.. జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ - హైదరాబాద్ ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. అంతకుముందు రహదారలపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సచివాలయం వేదికగా కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్రాంతికి వెళ్లేవారికి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని చెప్పారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని వాహనాల రద్దీపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఎక్కువ ఉంటుందని, ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫల్మ్ సిటీ వరకు రద్దీ ఎక్కువగా ఉంటుందని జాతీయ రహదారిపై వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో పనులు నిలిపివేయాలని, అత్యవసరంగా చేయాల్సిన పనులు రాత్రి వేళల్లో మాత్రమే చేయాలని ఆదేశించారు.






