TG: కఠిన చర్యలు తప్పవు.. మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-29 11:34:19  IST  )

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

TG: కఠిన చర్యలు తప్పవు.. మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువులు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వారి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇటీవల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోకుండా తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, తగిన మద్దతు ధర కల్పించడంలో కలెక్టర్లు చూపిన చొరవ అభినందనీయమని ప్రశంసించారు. నకిలీ విత్తనాల మాఫియాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ మండలంలో విత్తనాల తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతుల భద్రత కోసం ప్రభుత్వం నిబద్ధతగా పనిచేస్తోందని చెప్పారు. రూ.22,000 కోట్లతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా 4.5లక్షల కుటుంబాల సొంతింటి కలలు సాకార అవుతుందని అన్నారు. అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు దక్కాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను అధికారులు ర్యాండమ్‌గా చెక్ చేయాలన్నారు. నకిలీ విత్తనాలుపై తీసుకుంటున్న చర్యలను వెంటనే పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.రాష్ట్రంలోని పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ఆర్థిక వ్యవస్థ బాగు చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నామని అన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం పనులు 200 కోట్లతో ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.

Next Story