- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ధర్మం.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం(NLG Municipal Office) మరియు ఆర్డీఓ కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం(NLG Municipal Office) మరియు ఆర్డీఓ కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిపాలనా పరిస్థితులు, అధికారుల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల తీరును పరిశీలించారు. ఈ తనిఖీల్లో పలు ఫైళ్లనూ పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలందించే కేంద్రాలుగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా విని, పరిష్కారాలకు తగిన సూచనలు చేశారు. ప్రతి అధికారీ తన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాలి.. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ధర్మం అని చెప్పారు. ఈ ఆకస్మిక తనిఖీల ద్వారా జిల్లాలో పరిపాలనా బాధ్యత పెరగడం, ప్రజల్లో విశ్వాసం పెరగడం జరిగేలా చూడడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జవాబుదారీ పాలనను నెలకొల్పేందుకు ఈ రకమైన తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు.






