Komatireddy: సినిమా షూటింగ్స్ బంద్ చేయడం కరెక్ట్ కాదు

by Gantepaka Srikanth |

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫిల్మ్ ఫెడరేషన్(Film Federation) నాయకులు సమావేశం అయ్యారు.

Komatireddy: సినిమా షూటింగ్స్ బంద్ చేయడం కరెక్ట్ కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫిల్మ్ ఫెడరేషన్(Film Federation) నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు చేశారు. మొత్తానికే షూటింగ్స్ బంద్ చేసి ఆందోళన చేయడం కరెక్ట్ కాదని అన్నారు. పని చేస్తూనే డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా వారికి కోమటిరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) భరోసా ఇచ్చారు. కాగా, వేతనాల పెంపుపై నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నిర్మాతలు మూడు కేటగిరీలుగా కార్మికుల వేతనాలను పెంచుతామని ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనపై కార్మిక సంఘాలు సంతృప్తి చెందలేదు. నిర్మాతల నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రంగంలోకి దిగి సమస్యకు పరిష్కారం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Next Story