HAM: 5,190 కిలోమీటర్లు ‘హ్యామ్’ రోడ్లు వేసుకోబోతున్నాం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

HAM: 5,190 కిలోమీటర్లు ‘హ్యామ్’ రోడ్లు వేసుకోబోతున్నాం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నాక్ ఆడిటోరియంలో హ్యామ్ ప్రాజెక్టు రహదారులపై కీలక సమావేశం జరిగింది. ఆర్& బీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యంగ్ స్టేట్ అని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు. అందులో భాగంగానే హ్యామ్ రహదారుల నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు.

ప్రతి గ్రామాన్ని మండల కేంద్రానికి, ప్రతి మండలాన్ని జిల్లా కేంద్రానికి, ప్రతి జిల్లాను రాష్ట్ర రాజధానికి కలిపే విధంగా రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఆర్అండ్‌బీ ఆధ్వర్యంలో 17 ప్యాకేజీలో 5190 కిలోమీటర్ల రోడ్లు వేయబోతున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 17 ప్యాకేజీల్లో 7,947కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం పొందిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సహకారంతో పెద్ద ఎత్తున మంచి రోడ్లు వేసుకోబోతున్నట్లు తెలిపారు.

Next Story