- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ ఎన్నికలు: మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
సర్పంచ్ ఎన్నికలు: మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట్ జిల్లా మక్తల్‌లో జరిగిన ప్రజా పాలన–ప్రజా విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం రెండో ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి కృషితో మక్తల్ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించినట్లు వెల్లడించారు. జూరాల డ్యాం సేఫ్టీ కోసం కృష్ణా నదిపై రూ.122 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించాం. ఈ బ్రిడ్జితో నారాయణపేట్, వనపర్తి, గద్వాల్ ప్రాంతాల రవాణా మరింత మెరుగుపడుతుందని అన్నారు.
మక్తల్–నారాయణపేట్ 4 లేన్ల రహదారికి రూ.210 కోట్లతో శంకుస్థాపన చేశాం. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో రూ.11,399 కోట్లతో 419 రోడ్లను హ్యామ్ విధానంలో నిర్మించబోతున్నాం. మన్ననూర్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌ను రూ.8,000 కోట్లతో నిర్మించేందుకు సిద్ధమవుతున్నాం. గ్రామాల నుండి జిల్లా కేంద్రాల వరకు రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. వచ్చే మూడు సంవత్సరాల్లో రోడ్ల అభివృద్ధికి 80 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి, చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, హైవే కారిడార్‌లపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ పరిశ్రమల కేంద్రాలుగా ఎదగబోతున్నాయని అన్నారు.
గతంలో రేషన్ కార్డులు, ఇళ్లను ఇవ్వని పాలన లేదు. ఇందిరమ్మ ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తోంది. మళ్లీ ప్రజలు ఆశీర్వదించేది కాంగ్రెస్ ప్రభుత్వాన్నే. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను. అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులను గెలిపిస్తే ఉపయోగం ఉండదని సూచించారు. కోమటిరెడ్డి






