- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రాజెక్టులు తెలంగాణ దిశను మార్చబోతున్నాయి: మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
ఆ ప్రాజెక్టులు తెలంగాణ దిశను మార్చబోతున్నాయి: మంత్రి కోమటిరెడ్డి ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయంలో విజన్- 2047పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఆర్డీసీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో, రాష్ట్ర పురోగతిలో ఆర్‌అండ్‌బీ శాఖ కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. వచ్చే 5, 10, 15 ఏళ్ల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ప్రతి రహదారికి సమగ్రమైన యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
గత రెండేళ్లలో ఆర్‌అండ్‌బీ శాఖలో కోటికి పైగా చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్‌పోర్టులు వంటి భారీ ప్రాజెక్టులు తెలంగాణ అభివృద్ధి దిశను మార్చబోతున్నాయని అన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నాం. ఇప్పటివరకు చేసిన పనులు, అలాగే మన్ననూర్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, భారత్ ఫ్యూచర్ సిటీ–బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ హైవే, హైదరాబాద్–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే తదితర మౌలిక సదుపాయ ప్రాజెక్టులను ప్రపంచానికి వివరించనున్నట్లు తెలిపారు. ట్వీట్






