- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇవాళ చాలా హ్యాపీగా ఉంది’.. మంత్రి కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్
మహబూబూబాద్(Mahabubabad) మండలం సోమాల తండాలో మంగళవారం ప్రజాపాలన ప్రగతిబాట పేరిట సుమారు 100 కోట్ల రూపాయిల విలువైన అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మహబూబూబాద్(Mahabubabad) మండలం సోమాల తండాలో మంగళవారం ప్రజాపాలన ప్రగతిబాట పేరిట సుమారు 100 కోట్ల రూపాయిల విలువైన అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతనం సోషల్ మీడియా వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ఆసక్తికర ట్వీట్ పెట్టారు.
‘మహబూబాబాద్ నియోజకవర్గంలో రూ.100కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సహచర మంత్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణం. గత పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ.. సంక్షేమ పథకాల అమలుతో ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతూ.. అభివృద్ధి పథంలో తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం.. గ్రామం నుంచి నగరం వరకు ప్రతి ప్రాంతానికీ అభివృద్ధిని తీసుకెళ్లడం మా ప్రభుత్వ ధ్యేయం. ప్రజాపాలన - ప్రగతిబాట పేరిట సోమల తండాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క పాల్గొన్నారు.






