‘మాట ఇస్తే నిలబెట్టుకుంటాం’.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర ట్వీట్

by Gantepaka Srikanth |

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

‘మాట ఇస్తే నిలబెట్టుకుంటాం’.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘రూ.574.56 కోట్ల రూపాయలతో, 56 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించగల గంధమల్ల ప్రాజెక్టుతో పాటు తుర్కపల్లి మండలంలోని ములకలపల్లిలో 20 ఎకరాల్లో రూ.200 కోట్ల రూపాయల వ్యయంతో పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు శంకుస్థాపన. భువనగిరికి మరో మోడల్ స్కూల్ మంజూరు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు దాతర్‌పల్లిలో రూ.183 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన. దీంతో స్థానికంగా అందుబాటులోకి వైద్య సేవలు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో డ్రైనేజీలు, రోడ్లు, BT రోడ్ల అభివృద్ధి. రైతులకు ధాన్యం నిల్వ సదుపాయం. రహదారులు, బ్రిడ్జులు. మోటకొండుర్ మండల కేంద్ర అభివృద్ధి.

= తహసిల్దార్ కార్యాలయం అభివృద్ధికి రూ.2.60 కోట్లు

= ఎంపీపీ కార్యాలయం – రూ.3 కోట్లు

= పోలీస్ స్టేషన్ – రూ. 2.65 కోట్లు

= ఆలేరు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి రూ.2.75 కోట్లు

ఇదీ ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రగతి. ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది. అభివృద్ధే మా లక్ష్యం – ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే మా ధ్యేయం. ప్రతి వర్గానికీ మేలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్‌ చేశారు.

Next Story