- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR ఫామ్‌హౌజ్‌లో క్షుద్రపూజలు.. మంత్రి హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో క్షుద్రపూజలు

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. SLBC టన్నెల్ కూలిపోవాలని ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో క్షుద్రపూజలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఏడుపుల కారణంగానే SLBC టన్నెల్ పనుల్లో ముందుకు వెళ్లలేకపోయామని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని అన్నారు. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి చక్కబెడుతూ ముందుకు పోతున్నామని చెప్పారు. తాము చేస్తున్న అభివృద్ధి చూస్తుంటే కేసీఆర్‌కు కళ్ల మంటగా ఉందని విమర్శించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, రైతు భరోసా ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, సన్న బియ్యం ఇచ్చాం, 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం, ఇలా చెప్పుకుంటూ పోతే అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే తాము ఎంతో పనిచేశామని అన్నారు.






