హైదరాబాద్‌ వెళ్లాల్సిన అవసరం లేదు.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ(Congress Government) లక్ష్యం అని.. ఆ దిశగానే ముందుకు సాగుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అన్నారు.

హైదరాబాద్‌ వెళ్లాల్సిన అవసరం లేదు.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ(Congress Government) లక్ష్యం అని.. ఆ దిశగానే ముందుకు సాగుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అన్నారు. ఇన్నాళ్లు రోడ్డు ప్రమాదాలు జరిగితే అప్పుడు చేసి మరీ హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించాల్సిన పరిస్థితి నల్లగొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం క్రిటికల్ కేర్ బాక్స్‌(Critical Care Box) ఏర్పాటుతో సమస్య తీరిందని అన్నారు. శనివారం మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఉదయం ఎన్జీ కళాశాల(NG College) వద్ద బాబుజగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత జిల్లా పోలీస్ కార్యాలయంలో నిరుద్యోగుల కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన యువతేజం జాబేళాలో పాల్గొన్నారు. అనంతరం నల్లగొండ జనరల్ ఆస్పత్రి(Nalgonda General Hospital)లో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బాక్స్‌ను ప్రారంభించారు. ఈ తరహా ఆధునిక పరికరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు చికిత్స చేసేందుకు ఉపయోగపడతాయన్నారు. బాధితుల నుంచి ఇతరులకు కూడా టీబీ వ్యాపించే ప్రమాదం ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Next Story