- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదేనా నాకిచ్చే గౌరవం? .. టీచర్లపై మంత్రి కోమటిరెడ్డి అసహనం
ఉపాధ్యాయుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) అసహనం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) అసహనం వ్యక్తం చేశారు. నేడు ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers Day) సందర్భంగా నల్గొండలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేసి, బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతుండగా.. టీచర్లు భోజనానికి వెళ్లారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వారిపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతుండగా టీచర్లు అలా చేయడం ఏం బాలేదన్నారు. 5 నిమిషాల పాటు తనకెంతో బాధ అనిపించిందని, ఇదేనా టీచర్లకు ఉన్న క్రమశిక్షణ? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వేదికపై ఉన్న డీఈఓ భిక్షపతిని మందలించారు. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చానని, టీచర్లు తనకిచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.






