- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ పదేళ్లు ప్రజలను గాలికి వదిలేసారు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన సందర్భంగా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన సందర్భంగా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా, వలిగొండ నుంచి కాటేపల్లి వరకు రూ. 49.5 కోట్ల నిధులతో నిర్మించిన ఆర్ & బీ రోడ్డును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ రోడ్డు ప్రారంభంతో ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కేసీఆర్ పదేళ్లు ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
రెండేళ్ళు ఫామ్ హౌసులో దాక్కొని ఇప్పుడు వచ్చి నీతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. ఇక మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై జనవరి 5 నుంచి నిరాహార దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు చేసి.. బీజేపీని ప్రజల్లో ఎండగడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
READ MORE ....
నందినగర్ నివాసానికి గులాబీ బాస్ కేసీఆర్.. రేపటి అసెంబ్లీపై ఉత్కంఠ!






