- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నందినగర్ నివాసానికి గులాబీ బాస్ కేసీఆర్.. రేపటి అసెంబ్లీపై ఉత్కంఠ!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి ఇవాళ (ఆదివారం) హైదరాబాద్‌కు చేరుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి ఇవాళ (ఆదివారం) హైదరాబాద్‌కు చేరుకున్నారు. నందినగర్‌లోని తన నివాసానికి వచ్చిన కేసీఆర్ రేపటి నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలకు హాజరుకానున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి జనవరి తొలి వారం వరకు కొనసాగనున్నట్లు సమాచారం. ఈ సమావేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడటానికి ప్రధాన కారణం.. గత కొంతకాలంగా సభకు దూరంగా ఉన్న కేసీఆర్ మళ్లీ శాసనసభలో అడుగుపెట్టే అవకాశమే. ఆరోగ్య కారణాలు, ఇతర అంశాలతో గత సమావేశాలకు హాజరుకాని కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి వస్తారనే సంకేతాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేసేందుకు బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా-గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించిన అంశం, రైతు రుణమాఫీ అమలు తీరు, హామీల అమలులో లోపాలు వంటి విషయాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయనున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా కీలక నేతలు కూడా ఈ సమావేశాల్లో చురుగ్గా పాల్గొననున్నారు. మరోవైపు కేసీఆర్ తప్పకుండా అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా డిమాండ్ చేస్తుండటంతో, ఆయన హాజరుపై ఉత్కంఠ మరింత పెరిగింది. మొత్తంగా కేసీఆర్ పునరాగమనం, అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలతో ఈ సారి శాసనసభ సమావేశాలు రాజకీయంగా హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
READ MORE ....
కేసీఆర్ పదేళ్లు ప్రజలను గాలికి వదిలేసారు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి






