- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో 15 ఏళ్లు మేమే.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో మరో పదిహేనేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో పదిహేనేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ప్రజాపాలన-ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నల్లగొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజా పాలన మొదలైంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఉచిత కరెంటు బిల్లు, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. సర్పంచులు గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలి. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదు. గ్రామ సర్పంచులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతతో పని చేయాలి. ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి. గ్రామాలలో ఎలాంటి సమస్య ఉన్న సర్పంచులు నేరుగా కలెక్టర్‌ను గానీ నన్ను గానీ కలవచ్చు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది’ అని మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు.






