రైతు కుటుంబానికి అండగా మంత్రి కోమటిరెడ్డి

by Ajay Maddhiboyina |

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రాజిరెడ్డి బలవన్మరణం, దళిత యువకుడు రాములు గుండెపోటుతో మృతి చెందిన ఘటనలపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చలించిపోయారు.

రైతు కుటుంబానికి అండగా మంత్రి కోమటిరెడ్డి
X

దిశ తెలంగాణ బ్యూరో: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రాజిరెడ్డి బలవన్మరణం, దళిత యువకుడు రాములు గుండెపోటుతో మృతి చెందిన ఘటనలపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చలించిపోయారు. మృతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూనే, ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన ఆవులు స్థానిక వాతావరణానికి అలవాటుపడలేక మృత్యువాత పడటంతో అప్పుల భారం ఎక్కువై రాజిరెడ్డి బలవన్మరణంకు పాల్పడ్డ ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసి ఘనపూర్ వచ్చినట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఇదే గ్రామంలో దళితుడు రాములు గుండె పోటుతో మృతి చెందాడని తెలిసి స్థానిక నాయకులతో కలిసి ఇరు కుటుంబాలను మంత్రి పరామర్శించి దైర్యం చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి రెండు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. రైతు బీమా రూ. 5 లక్షలు వారం రోజుల్లో అందజేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విషయం చెప్పగానే ఆయన సానుకూలంగా స్పందించారని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా పూర్తి అండగా ఉంటామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భరోసా కల్పించారు.

Next Story