- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి మళ్లీ CM కావాలని మంత్రి కోమటిరెడ్డి గణపతి పూజ
రేవంత్ రెడ్డి(Revanth Reddy) మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) గణపతి పూజ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి(Revanth Reddy) మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) గణపతి పూజ చేశారు. నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపి సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మీరు మరోసారి ముఖ్యమంత్రి కావాలని గణపతి పూజ చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి చెప్పడం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.20వేల కోట్లతో 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి ప్రణాళిక వేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నల్గొండ నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ స్కూళ్లను 9 నెలల్లో పూర్తి చేసే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.






