అందుకే పవన్ కల్యాణ్‌పై మాట్లాడా.. మంత్రి కోమటిరెడ్డి వివరణ

by Gantepaka Srikanth |

అందుకే పవన్ కల్యాణ్‌పై మాట్లాడా.. మంత్రి కోమటిరెడ్డి వివరణ

అందుకే పవన్ కల్యాణ్‌పై మాట్లాడా.. మంత్రి కోమటిరెడ్డి వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నేతల దిష్టి తగిలి ఏపీలోని కోనసీమ(Konaseema) కొబ్బరి తోటలు ఎండిపోయాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy).. పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పకపోతే.. ఆయన సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం అని ప్రకటన చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘పవన్‌ కల్యాణ్‌పై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశా.. ఇప్పుడు చంద్రబాబును ఆహ్వానించడానికి వచ్చా. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి.. అదే స్నేహం కొనసాగాలి. నాకు ఎవరిపైనా వ్యక్తిగత కోపం లేదు. ఉండదు కూడా. పవన్‌తో నాకు ఎలాంటి వ్యక్తిగత భేదాలు లేవు. చంద్రబాబు విజన్‌ 2020 అభివృద్ధికి ప్రతిరూపం హైదరాబాద్‌’’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

Next Story