తెలంగాణ టీవీ అవార్డులకు కీలక నేత పేరు.. మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

తెలంగాణలో బుల్లితెర (టెలివిజన్) రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సినీ రంగానికి తోడుగా టీవీ రంగానికి కూడా ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ టీవీ అవార్డులకు కీలక నేత పేరు.. మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బుల్లితెర (టెలివిజన్) రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సినీ రంగానికి తోడుగా టీవీ రంగానికి కూడా ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు టెలివిజన్ అవార్డు కమిటీ ప్రతినిధులతో మంత్రి సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీవీ అవార్డులకు సంబంధించి లోగో, కేటగిరీలు, ప్రత్యేక పేరు రూపకల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ సంస్కృతి, ఆత్మ ప్రతిబింబించేలా ఈ అవార్డుల లోగో, పేరు ఉండాలని మంత్రి సూచించారు.

పీవీ నరసింహారావు పేరు పరిశీలన..

తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును ఈ టీవీ అవార్డులకు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా చూడాలని కమిటీకి సూచించారు. దీనికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను త్వరగా సిద్ధం చేయాలని టెలివిజన్ అవార్డు కమిటీ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో బుల్లితెర నటులు, సాంకేతిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story