- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో పవన్ సినిమాలు రిలీజ్ అవ్వవు.. సినిమాటో గ్రఫీ మంత్రిగా చెబుతున్నా: కోమటిరెడ్డి
కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలినట్టు ఉంది అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తెలంగాణ వచ్చి పదేళ్లకు పైగా అవుతోందని అన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణను అవమానించేలా మాట్లాడవదన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలినట్టు ఉంది అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తెలంగాణ వచ్చి పదేళ్లకు పైగా అవుతోందని అన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణను అవమానించేలా మాట్లాడవదన్నారు. పవన్ కల్యాణ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెప్పకపోతే ఒక్క సినిమా కూడా ఆడనివ్వము అంటూ హెచ్చరించారు.
చిరంజీవి సూపర్ మ్యాన్ అని ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారని అన్నారు. కానీ పవన్ కల్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అవ్వగానే తెలిసి తెలియక మాట్లాడారో కావాలనే మాట్లాడారో కానీ క్షమాపణ చెప్పాలన్నారు. అలా చేస్తేనే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులు అయినా థియేటర్లో ఆడతాయన్నారు. లేదంటే ఆయన సినిమాలు తెలంగాణలో విడుదల అవ్వవని.. సినిమాటో గ్రఫీ శాఖ మంత్రిగా ఈ విషయం చెబుతున్నానని చెప్పారు.
ఇదిలా ఉంటే పవన్ ఇటీవల కోణసీమలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ నాయకులు కోణసీమ పచ్చదనంతో ఉంటుందని అనేవారని ఇప్పుడు కొబ్బరిచెట్లకు మొండాలు కూడా లేవన్నారు. అంత దిష్టి కోనసీమకు తగిలిందన్నారు. నరుడి దిష్టికి నల్లరాయి అయినా బద్దలైపోతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే అని వ్యాఖ్యానించారు.






