Telangana budget 2023 ఓ గిమ్మిక్కు : Minister Kishan Reddy

by Dishanational2 |
Union Minister Kishan Reddy Asks CM KCR for Evidence Of Cloudburst
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఓ గిమ్మిక్కు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఢిల్లీలో తెలంగాణ బడ్జెట్ పై స్పందించిన ఆయన బడ్జెట్ లో అన్నీ అబద్ధాలు, అవాస్తవ లెక్కలు,అమలుకాని వాగ్దానాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అడ్వయిర్టయిజ్‌మెంట్, పబ్లిసిటీ కోసం రూ.1000 కోట్లను కేటాయించిన ఫామ్‌హౌజ్ కుటుంబ ప్రభుత్వం ఇదని ఆరోపించారు.

పేదలకు భరోసాను ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకానికి తక్కువ నిధులు కేటాయించడం దారుణమని మండిపడ్డారు. భారీ బడ్జెట్ అంటూ డాంభికాలు పలుకుతోందని వాస్తవానికి సవరించిన అంచనాలు తగ్గిపోయాయని అన్నారు. కేటాయింపుల్లో ఖర్చుచేసేది చాలా తక్కువే అని విమర్శించిన ఆయన ఇదీ బీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్లకున్న చరిత్ర అని ఆరోపించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇదే తంతు కొనసాగిందని, ఇలాంటి గిమ్మిక్కులతో ఫలితం లేదని ప్రజలకు అర్థమైందన్నారు. తెలంగాణ బడ్జెట్‌ను చూసి ప్రజలు విసుగుచెందుతున్నారని విమర్శించారు.

Read More..

3,016 రూపాయలతో బతికేదెలా?.. బడ్జెట్‌పై వికలాంగుల ఆవేదన


Next Story

Most Viewed