- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

- తెలంగాణ కేంద్రం నిరంతరం సహకారం అందిస్తోంది : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు రాబోయే ఐదు సంవత్సరాల్లో 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం అప్పగించడం అభినందనీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతర సహకారం అందిస్తోందని, ప్రధాని మోడీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎక్స్‌వేదిక శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఇంటర్‌సిటీ రైళ్లు 20 కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో, ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్ ,సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక సదుపాయాలను కలిగి ఉంటాయి. ఈ రైళ్లు సాధారణంగా సుమారు 300 కిలోమీటర్లు ఉన్న దూరం ఉన్న మార్గాలలో ప్రయాణిస్తాయి. పట్టణాలు, నగరాల మధ్య ప్రజలు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా, ప్రతి ట్రిప్‌లో అనేక స్టాప్‌లు ఉంటాయని గంటకు 130 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. రైళ్లు తమ సమీప పట్టణాలలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు, తమ ఆరోగ్యం, ఉద్యోగ అవసరాల కోసం ప్రయాణించే సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని వెల్లడించారు.






