- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టన్నెల్లో చిక్కుకున్న 8 మంది బతికే చాన్స్ లేదు.. ప్రమాదంపై మంత్రి జూపల్లి కీలక అప్డేట్
అద్భుతం జరిగితే తప్ప టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది బతికే చాన్స్ లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) మండిపడ్డారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశం తోనే ఎస్ఎల్‌బీసీపై హరీశ్‌రావు (Harish Rao) వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పదేళ్లుగా బీఆర్ఎస్ ఎందుకు (SLBC Tunnel) ఎస్ఎల్‌బీసీని పెండింగ్ పెట్టిందని హరీశ్‌రావుకు సూటి ప్రశ్న వేశారు. ఎందుకు 200 లోమీటర్లు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తవ్వి మిగతా ది వదిలేశారు? తక్కవ లాభం వస్తుందనా? ఎస్ఎల్‌బీసీ పూర్తి అయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనా? ఈ మూడు ప్రశ్నలకు హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తుని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఎస్ఎల్‌బీసీ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కే లేదన్నారు. (BRS) బీఆర్ఎస్ శవాల మీద పేలాలు ఎరుకుంటుందని అన్నారు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రమాదంలో 6గురు చనిపోయారని, కేసీఆర్, సంబంధిత మంత్రి హరీశ్‌రావు వచ్చిండా? అని ప్రశ్నించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 70మంది చనిపోతే కేసీఆర్, హరీశ్‌రావు పోయారా? అని ప్రశ్నించారు.
టన్నెల్లో చిక్కుకున్న 8 మంది బతికే చాన్స్ లేదు
ఎస్ఎల్‌బీసీ భాదితులను పరామర్శించడానికి పర్మిషన్ ఇచ్చామని, కానీ అక్కడికి పోయి రాజకీయాలు ఎందుకు? అని ప్రశ్నించారు. పూర్తి చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎకరాకు రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని, అదనంగా ఎకరాకు రూ.10 వేలు ఖర్చు అవుతుందన్నారు. ఇతర ప్రాజెక్టులకు వేల కోట్ల కరెంట్ బిల్లు వస్తుందని అన్నారు. యుద్ధ భూమిలో హెలికాప్టర్ నడిపిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని సార్లు హెలికాప్టర్ లో తిరిగినా ఏడాదికి ఒకసారి మాత్రమే రెంట్ కడతారని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పోయిన అని హరీశ్‌రావు అంటున్నారని, అమరవీరులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు.. అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని సమాధానం చెప్పారు. ఇప్పటికైనా హరీష్ రావు శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది బతికే చాన్స్ లేదని స్పష్టం చేశారు. సహక చర్యలకు ఇంకా రెండు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు కంపెనీ వాళ్ళు అలెర్ట్ చేయకపోతే 40 మంది వరకు చనిపోయే వారని తెలిపారు.






