- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గొంతు చించుకుని వేస్ట్’.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కౌంటర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) జోస్యం చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లడారు. జూబ్లీహిల్స్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు. ఇది తెలిసి కేటీఆర్(KTR), ఇతర బీఆర్ఎస్(BRS) నాయకులు కాంగ్రెస్ పార్టీ(Telangana Congress) ప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నంలో భాగంగా బట్టకాల్చి మీద వేసే విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాకీ కార్డు పేరుతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మీ పెయిడ్ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ నేతలు చెప్పేది వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని తెలిపారు. ఎవరు.. ఎవరికి బాకీ పడ్డారో అందరికీ తెలుసని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు కేసీఆర్ చేశారు.. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళ తీయించారు.. మీరు చేసిన అప్పులకు ఏడాదికి రూ.75 వేల కోట్ల వడ్డీలు కడుతున్నాం.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయింది.. వడ్డీలు కడుతూనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశాం.. మాకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. మిగిలిని హామీలను కూడా నెరవేరుస్తామని జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు.
బుల్డోజర్ ప్రభుత్వమని కేటీఆర్ మాట్లాడుతున్నారు.. పదేండ్లు ప్రజల ఆస్తులను, రాష్ట్ర ఖజానాను బుల్డోజ్ చేసింది కేసీఆర్ కుటుంబం కాదా.. కబ్జా అయిన ప్రభుత్వం ఆస్తులను, చెరువులను, నాలాలను కాపాడితే దాన్ని బుల్డోజ్ అంటారా? అని సీరియస్ అయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది.. ఖచ్చితంగా ప్రజల రుణం తీర్చకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని దోచుకున్న బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్ముతారని ఎలా అనుకుంటున్నారు.. మీరు ఎంత గొంతు చించుకున్నా ఉపయోగం లేదు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైందని విమర్శించారు.






