- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పులకు నెలకు 6 వేల కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం: మంత్రి జూపల్లి
నీటి వాటా అంశాలపట్ల సీఎం రేవంత్ రెడ్డి చర్చ పెడదాం అని చెప్పిన తరువాత బీఆర్ఎస్ నాయకుల బండారం బయట పడుతుందనే బాయ్ కాట్ చేశారని పర్యటక ఎక్సయిజ్ మంత్రి జూపల్లి కృష్ణరావు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయిట్ వద్ద ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నీటి వాటా అంశాలపట్ల సీఎం రేవంత్ రెడ్డి చర్చ పెడదాం అని చెప్పిన తరువాత బీఆర్ఎస్ నాయకుల బండారం బయట పడుతుందనే బాయ్ కాట్ చేశారని పర్యటక ఎక్సయిజ్ మంత్రి జూపల్లి కృష్ణరావు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయిట్ వద్ద ఆరోపించారు. ఆనాటి ప్రతి పక్షం మైక్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సెషన్ బహిష్కరణ చేయలేదని గుర్తు చేశారు. 2018 లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ అసెంబ్లీలో గొడవ చేశారని సభ్యత్వం రద్దు చేసిన విషయం హరీష్ రావు మరిచిపోయారా? అని ప్రశ్నించారు. నీటీ వాటా అంశాల పై అసలు వాస్తవాలు, వారి సంతకాలు, బండారం బయట పడుతుందనే శాసన సభ రాకుండా తప్పించుకోవడానికి చేసిన డ్రామా కనబడుతుందని విమర్శించారు.
శాసన సభలో హరీష్ రావు స్పీకర్ మైక్ ఇవ్వని కారణంగా బాయ్కాట్ చేయడం అంతా నాటకం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుందనే ధోరణితో హరీష్ రావు మాట్లాడుతున్నారని విమర్శించారు. పాలమూరు జిల్లాలో తెలంగాణ కోసం వందలాది మంది ప్రాణ త్యాగం చేసుకుంటే చేసింది ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరం కోసం లక్ష కోట్లు పెట్టీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు 25% కూడా పూర్తి చేయలేదని తెలిపారు. అధికారం పోయిందని, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు, ఉప ఎన్నికల్లో విఫలం అయ్యారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయినా మెజారిటీ స్థానాలు గెలవలేదని విమర్శించారు.
మూసి రివర్ పై మైక్ ఇవ్వకపోతే సెషన్ బాయ్ కాట్ చేయడం రాజకీయ పబ్బం గడుపుకోవడమేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందరి పాత్ర త్యాగాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఉద్యమ స్పూర్తికి విరుద్ధంగా, ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసి పాలించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చేసిన అప్పులకు నెలకు 6 వేల కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నామని తెలిపారు. ప్రజలను కన్ఫ్యూజన్ పెట్టాల్సిన అవసరం లేదని అన్ని లెక్కలు ఉన్నాయని తెలిపారు. వాటిపై చర్చ జరగాలి ఈరోజు మీరు చేసింది డ్రామా, యాక్షన్ మాత్రమేనని విమర్శించారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు పారె కృష్ణా జలాలపై చర్చకు రావాలన్నారు. అబద్ధాలు, బండారాలు బయట పడుతుందనే బాయ్ కాట్ చేశారని తెలిపారు. పాలమూరు జిల్లా ప్రజా ప్రతినిధులుగా చెపుతున్నాము చర్చలో పాల్గొని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.






