- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్సయిజ్ శాఖ ఏం చేస్తోంది, డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీపై సమగ్ర నివేదిక ఇవ్వాలి: మంత్రి జూపల్లి
చర్లపల్లి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రొహిబిషన్ ఎక్సయిజ్ శాఖ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలను మహారాష్ట్ర పోలీసులు స్వాదీనం చేసుకున్నారని, ఇంత జరుగుతున్న ఎక్సయిజ్ శాఖ ఏం చేస్తుందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: చర్లపల్లి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రొహిబిషన్ ఎక్సయిజ్ శాఖ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలను మహారాష్ట్ర పోలీసులు స్వాదీనం చేసుకున్నారని, ఇంత జరుగుతున్న ఎక్సయిజ్ శాఖ ఏం చేస్తుందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్‌వర్క్ మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డ నేపథ్యంలో కేసు పూర్వాపరాలను మంత్రి సమీక్షించారు. డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎక్సయిజ్ శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు కార్యచరణను రూపొందించాలని దిశానిర్ధేశం చేశారు.
డ్రగ్స్ నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల సాగు, తయరీ, రవాణా, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల నుంచి విక్రయదారుల వరకు సరఫరా లింకులపై డేగ కన్ను వేసి ఉంచాలన్నారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, విద్యార్థులు, యువకులను కొందరు గంజాయి స్మగ్లర్లు ఆసరాగా చేసుకున్నారని అన్నారు. నిఘా పెట్టాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో ఎక్సయిజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ఎక్సయిజ్ శాఖ కమిషనర్ హరికిరణ్, అదనపు కమిషనర్ ఖురేషీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు ఎక్సయిజ్ శాఖ అదనపు కమిషనర్ ఖురేషీ, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథం, ఇతర అధికారులు వాగ్దేవి ల్యాబోరేటరీస్ ను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుపుతున్నారు. మంగళవారం పై నివేదికను అందజేయనన్నట్లు ఎక్సయిజ్ అధికారులు తెలిపారు.






