కేసీఆర్ పాలనలో నిజాయితీ కనిపించలేదు.. అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చా: మంత్రి జూపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ పాలనలో నిజాయితీ కనిపించలేదు.. అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చా: మంత్రి జూపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ కన్నతల్లుల కడుపుకోతను సోనియా గాంధీ(Sonia Gandhi) అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చారని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే కేసీఆర్(KCR) ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర లేదు అని తాను అనడం లేదు. కానీ తన వల్లే రాష్ట్రం వచ్చిందంటే మాత్రం ఒప్పుకోను అని అన్నారు. తాను బీఆర్ఎస్ హయాంలో మూడేళ్లు మంత్రిగా పనిచేశానని తెలిపారు. కేసీఆర్ పాలనలో నిజాయితీ కనిపించలేదు అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

అందుకే బీఆర్ఎస్ హయాంలో అప్పులు విపరీతంగా పెరిగాయని అన్నారు. ‘ఆ మధ్య వరంగల్లో నిర్వహించిన సభలో కేసీఆర్ నాకు దుఃఖం వస్తుంది అన్నాడు.. మీకు అధికారం పోయినందుకు దుఃఖం వచ్చిందా..? లేక అప్పుల కుప్పగా మార్చిన ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక దుఃఖం వచ్చిందా?’ అని జూపల్లి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ఆగమేఘాల మీద పూర్తి చేసిన కాళేశ్వరం కుప్పకూలిందని విమర్శించారు.

Next Story