- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jupally: సాంస్కృతిక సారధి ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. మంత్రి జూపల్లి కీలక ప్రకటన
తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మంత్రి జూపల్లి కీలక ప్రకటన చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రతి నెల ఒక నిర్ణీత తేదిన వేతనాలు, పీఆర్సీ అమలు, వాహన సదుపాయం, తదితర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ప్రకటించారు. శుక్రవారం రవీంద్రభారతిలో (Department of Language and Culture) తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ సాంస్కృతిక సారథి కళాకారులకు హెల్త్ కార్డులు, మృతిచెందిన కళాకారుల కుటుంబాలకు పరిహారం, మెటర్నిటీ లీవులు, ఏరియర్స్, ఇందిరమ్మ ఇండ్లు, బస్ పాసులు వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకేళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కళాకారులకు జిల్లాకో వాహనం, దానికి మైక్ సిస్టం సదుపాయాన్ని కల్పించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సాంస్కృతిక కళా సారధులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం తెలంగాణ ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రూపొందించిన పాటల సీడీని మంత్రి జూపల్లి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నర్సింహా రెడ్డి, సాంస్కృతిక కళా సారధి చైర్ పర్సన్ డా. వెన్నెల గద్దర్, కళాకారులు పాల్గొన్నారు.






