- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Jupally: మీకు ఆ రోజు సిగ్గు లేదా? పార్టీ ఫిరాయింపుల అంశంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వివాదంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వివాదంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) స్పందించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిశామని వారు చెబుతున్నారని గుర్తుకు చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని, ఆ అంశం కోర్టు పరిధిలోనిదన్నారు. దానిపై తాము ఎందుకు చర్చించాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రేపు ఎల్లుండి కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలు మాట్లాడారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలు ఏదో తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నారు.. మీకు ఆ రోజు సిగ్గు లేదా..? 88 స్థానాలు గెలిచిన తర్వాత కూడా గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకోలేదా..? అని నిలదీశారు. మేము ఏ తప్పు చేయలేదు కదా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది మీరు.. మళ్లీ మీరే సిగ్గుందా అని మాట్లాడుతున్నారని కేటీఆర్‌పై మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు. ఆయన సగం మాట్లాడి సగం వదిలేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు పనుల కోసం కలిశామని చెబుతున్నా కూడా.. మీరు పార్టీలో చేరారు అనడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో నిర్ణయాలు చట్ట ప్రకారమే ఉంటాయని, స్పీకర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు.
ఆదిలాబాద్‌లో నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. నేను చెప్పిన సందర్భాన్ని వదిలేశారని అన్నారు. నేను ఎమన్నానంటే? ఏడు సార్లు పోటీ చేశాను.. ఏడు పర్యాయాలు పోటీ చేసిన ఏ వేదికపై హామీలు ఇవ్వలేదు.. అయిన కూడా అన్ని పనులు చేశాను.. దాన్ని వదిలేసి జూపల్లి అస్త్రాన్ని వదిలేశారు. నిరాశలో ఉన్నాడని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.






