- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Jupally: గతంలో చంద్రబాబు హేళన చేశారు.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అవుతున్న ఖర్చు కంటే కేసీఆర్ చేసిన బాకీకి కడుతున్న వడ్డీ ఎక్కువగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అవుతున్న ఖర్చు కంటే కేసీఆర్ చేసిన బాకీకి కడుతున్న వడ్డీ ఎక్కువగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం మితిమీరి చేసిన అప్పుల వల్లే ఇప్పుడు హామీల అమలులో కొంత జాప్యం జరుగుతోందని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పు కంటే పదింతల అప్పులు చేసి రాష్ట్రాన్ని కేసీఆర్ అంధకారంలోకి నెట్టేశారని ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మేము ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మా ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న చీరలు గతంలో ఇందిరమ్మ కట్టిన చీరల్లాగే ఉన్నాయని కొనియాడారు. నాణ్యతలో రాజీపడకుండా ప్రభుత్వం చీరలు తయారు చేయించిందన్నారు. మహిళా సంఘాల్లో లేని మహిళలకు సైతం చీరలు అందుతాయని, కొల్లాపూర్‌లో సరిగ్గా రోడ్లు కూడా లేవని గతంలో చంద్రబాబు నాయుడు హేళన చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎమ్మెల్యేగా కిరణ్‌కుమార్ రెడ్డిని పట్టుబట్టి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించామని పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..






