ఇకపై ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు.. గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా నేరాలపై ఉక్కు పాదం: అధికారులతో మంత్రి సమీక్ష

by Ramesh Naini |

ప్రజల ప్రాణాలే ముఖ్యమని గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సయిజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

ఇకపై ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు.. గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా నేరాలపై ఉక్కు పాదం: అధికారులతో మంత్రి సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల ప్రాణాలే ముఖ్యమని గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సయిజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) తెలిపారు. ఎక్సయిజ్ సిబ్బందికి ఆయుధాలను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, శిక్షణ కూడా ఇస్తామని ఆయన తెలిపారు. ఎక్సయిజ్‌శాఖ భవన్‌లోని సమావేశ మందిరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌ఎస్‌టీఎఫ్ అండ్ డీటీఎఫ్ , ఎన్‌ఫొర్స్‌మెంట్‌ టీమ్‌లతో మంత్రి జూపల్లి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు ఎక్సయిజ్ ప్రిన్సిపల్‌ సెకట్రరీ రీజ్వీ, ఎక్సైజ్‌ కమిషనర్‌ సి.హరి కిరణ్‌, ఎన్‌ఫొ ర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీంతో పాటు అడిషనర్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఎక్సైజ్‌ఖ శాఖ పట్టుకున్న నల్లా బెల్లాన్ని రైతులకు సేంద్రియ ఎరువుల తయారీకి ఇవ్వడానికి అవసరమైన మార్గ దర్శకాలను తయారు చేయాలన్నారు. నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ను పట్టుకున్నప్పుడు ధ్వంసం చేయకుండా జాతీయ ఉత్పత్తిగా గుర్తించి అమ్మకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నాచారం, చర్లపల్లి లాంటి ప్రాంతాలలో ఇల్లీగల్‌ పరిశ్రలను తనిఖీలు చేపట్టడానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. తాటి, ఈత చెట్లు పెంపకం తోపాటు, కల్లుగీత వృతికి యువత దూరంగా ఉన్నారని, కల్లును బ్రోవరీగా తయారు చేసే కంపెనీలు ఏర్పాటుపై చర్యలు పెట్టాలన్నారు. ఒకే బార్‌ లైసన్స్‌ పై ఎక్కువ బార్లు నడుపుతున్న ఆరోపణలు వస్తున్నాయని, చర్యలు చెపట్టాలన్నారు. ఫామ్ హౌస్‌లపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఖాళీగా ఉన్న రైస్‌ మిల్లులను, ఇతర ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లా డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎస్టీఎఫ్,డీటీఎఫ్, టీమ్‌లు సమావేశంలో పాల్గోన్నారు.

Next Story