Jupally: బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నేను లొంగను.. తన అల్లుడి అంశంపై స్పందించిన మంత్రి జూపల్లి

by Prasad Jukanti |   (  Updated:2025-10-15 12:36:49  IST  )

కుట్రపూరిత ఆరోపణల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి జూపల్లి అన్నారు.

Jupally: బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నేను లొంగను.. తన అల్లుడి అంశంపై  స్పందించిన మంత్రి జూపల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నేను లొంగనని, తప్పుడు వార్తలు, ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ (Jupally Chit Chat) నిర్వహించిన జూపల్లి తన మేనల్లుడు సతీశ్ రావు కనపర్తి (Satish Rao Kanaparthi) ఆర్గానిక్ చైన్ స్టోర్స్ విషయంలో వచ్చిన ఆరోపణపై స్పందించారు. కుట్రపూరిత ఆరోపణల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదని తప్పు ఒప్పులు అందరి దగ్గర జరుగుతాయి. ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటారన్నారు. లిక్కర్ టెండర్లు చివరి మూడు రోజుల్లో భారీ సంఖ్యలో వస్తాయని గతసారి చివరి మూడు రోజుల్లో 96వేల టెండర్లు పడ్డాయన్నారు.

అసలేంటి మంత్రి అల్లుడి వ్యవహారం?:

అమెరికాలో ఉండే మంత్రి జూపల్లి కృష్ణారావు మేనల్లుడు సతీశ్ రావు కనపర్తి తన మేనమామ మంత్రి కావటంతో ఆయన ఇండియాకు వచ్చి ఆర్గానిక్ చైన్ స్టోర్స్ పేరుతో వ్యాపారం మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. హైద్రాబాద్‍లో 4 స్టోర్‍లు ప్రారంభించిన సతీశ్ రావు నేచురల్‍గా పండిన వ్యవసాయ ఉత్పత్తులు అందించి ఆరోగ్యం కాపాడుతానని ప్రజలను నమ్మించి వారి వద్ద కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన్ను నమ్మి అనేక మంది సీనియర్ సిటిజన్లు తమ జీవిత కష్టార్జితం అంతా తెచ్చి సతీష్ కు అప్పగించారు. కొంతకాలం నెల నెల వడ్డీలు కడుతూ వారిలో నమ్మకం కలిగించిన సతీశ్ అలా కోట్లాది రుపాయలు వసూలు చేశారు. అనంతరం ఆ సొమ్మంతా పక్కదారి పట్టించి అమెరికా పరార్ అయ్యారని దాంతో తమ డబ్బులెవని అడిగిన బాధితులను సతీశ్ రావు బెదిరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మంత్రి జూపల్లి స్పందించారు.

Next Story